Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడేజా రికార్డు... కపిల్ - కుంబ్లే రికార్డులు మాయం...

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత క్రికెట్ దిగ్గజాలైన క‌పిల్ దేవ్‌, అనిల్ కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌ల‌ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు.

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (15:51 IST)
భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత క్రికెట్ దిగ్గజాలైన క‌పిల్ దేవ్‌, అనిల్ కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌ల‌ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. కొలంబో వేదికగా శ్రీలంక‌తో జ‌రిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జడేజా ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 
 
లంక బ్యాట్స్‌మ‌న్ ధ‌నంజ‌య డిసిల్వాను ఔట్ చేసిన జ‌డేజా.. టెస్టుల్లో 150 వికెట్లు తీసుకున్నాడు. కేవ‌లం 32 టెస్టుల్లోనే జ‌డేజా 150 వికెట్ల మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో అనిల్ కుంబ్లే (34), హ‌ర్భ‌జ‌న్ సింగ్ (35), క‌పిల్ దేవ్ (39 టెస్టులు)ల‌ను అత‌ను వెన‌క్కి నెట్టాడు. 
 
అయితే ప్ర‌స్తుతం అత‌ని టీమ్ మేట్, ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ మాత్రం ఇంకా జ‌డ్డూ కంటే ముందున్నాడు. అత‌ను కేవ‌లం 29 టెస్టుల్లోనే 150 వికెట్లు తీశాడు. ఇక లెఫ్టామ్ బౌల‌ర్ల‌లో మాత్రం జ‌డ్డూ వ‌ర‌ల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అత్యంత వేగంగా 150 వికెట్లు అందుకున్న లెఫ్టామ్ బౌల‌ర్‌గా మిచెల్ జాన్స‌న్ పేరిట ఉన్న రికార్డును జ‌డ్డూ అధిగ‌మించాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments