Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ! సరైన నిర్ణయమన్న రవిశాస్త్రి

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (20:07 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్‌గా రోజర్ బిన్నీ నియామకం ఖరారైంది. ఆయన ఈ నెల 18వ తేదీ నుంచి బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983లో ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడుగా ఉన్నారు. 
 
ఈ నియామకంపై ఆ జట్టు సభ్యుడైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ నియామకం సరైన నిర్ణయమని అన్నారు. బిన్నీ విజయవంతమైన బీసీసీఐ అధ్యక్షుడుగా కొనసాగుతాడని, ఆయనకు ఆ మేరకు అన్ని విధాలా శక్తి  సామర్థ్యాలు ఉన్నాయని రవిశాస్త్రి అన్నారు. 
 
బిన్నీని ఎంపికపట్ల తాను సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. ఎందుకంటే బిన్నీ ప్రపంచ కప్‌లో తన సహచర ఆటగాడు, కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని తెలిపారు. పైగా, బీసీసీఐ చరిత్రలో ప్రపంచ కప్ విజేత జట్టుకు చెందిన సభ్యుడిని బీసీసీఐ చీఫ్‌గా నియమించడం ఇదే తొలిసారి అని రవిశాస్త్రి గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments