Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత స్టార్ ఆటగాళ్ళ వార్షిక ఆదాయం రూ.100 కోట్లు : రవిశాస్త్రి

ఠాగూర్
బుధవారం, 23 జులై 2025 (14:50 IST)
భారత క్రికెటర్ల వార్షిక ఆదాయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్ల వార్షిక ఆదాయం రూ.100 కోట్లు దాటుతుందని ఆయన అంచనా వేశాడు. ఈ భారీ సంపాదనలో బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన  అభిప్రాయపడ్డారు. 
 
'ది ఓవర్ ల్యాప్ క్రికెట్' అనే కార్యక్రమంలో భారత క్రికెటర్ల జీవితం, ఒత్తిళ్ల గురించి మాట్లాడుతూ, వారి ఆదాయం గురించి అడిగినప్పుడు శాస్త్రి ఈ విషయాలను వెల్లడించారు. ఖచ్చితమైన అంకెలు తనకు తెలియకపోయినా, అది రూ.100 కోట్ల వరకు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నారని, దీని ద్వారా వారు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారని శాస్త్రి పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు, అక్కడే ఉన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైఖేల్ వాఘన్, అలిస్టర్ కుక్ ఆశ్చర్యానికి లోనయ్యారు.
 
"వారు చాలా సంపాదిస్తారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా చాలా ఎక్కువ సంపాదిస్తారు. అది బహుశా రూ.100 కోట్లకు పైగానే ఉండొచ్చు. ఇక మీరు లెక్క వేసుకోండి" అని శాస్త్రి అన్నారు. ధోని, విరాట్, లేదా సచిన్ టెండూల్కర్ తమ కెరీర్లో అగ్రస్థానంలో ఉన్నప్పుడు 15-20 యాడ్స్ చేసేవారని, కేవలం ఒక రోజు షూట్ చేసి, ఆ ఫుటేజీని ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments