Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డ్-రంజీల్లో డబుల్ టన్

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (19:54 IST)
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదైంది. అలాగే రంజీల్లో డబుల్ సెంచరీ సాధించాడు.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్‌ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ తీసిన తొలి బౌలర్‌గా మధ్యప్రదేశ్ క్రికెటప్ రవి యాదవ్ చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అతను తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌ నమోదు చేయడం విశేషం. 
 
28ఏళ్ల లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ యాదవ్‌ యూపీకి చెందిన వాడు. యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వరుస బంతుల్లో ఆర్యన్‌ జుయాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, సమీర్‌ రిజ్వీలను పెవిలియన్‌ పంపాడు. రవి స్పెషల్‌ హ్యాట్రిక్‌ వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  
 
అలాగే రంజీల్లో కూడా కొత్త రికార్డు నమోదైంది. కొద్ది రోజుల క్రితమే రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ 301 పరుగులు చేశాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ అదే దూకుడును రంజీల్లో కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ మంగళవారం వరుసగా రెండో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 
 
ముంబై జట్టు తరపున ఆడుతున్న సర్ఫరాజ్ మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టును సర్ఫరాజ్ గట్టెక్కించాడు. కేవలం 213 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సుల సహాయంతో 226 పరుగులు చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు 5 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments