Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-8 : హైదరాబాద్ ఓటమి.. రాజస్థాన్ రాయల్స్ గెలుపు!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:32 IST)
ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్‌ విజయం సాధించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుని తన ఖాతాలో మరో గెలుపును నమోదు చేసుకుంది. 
 
రాజస్థాన్ విజయానికి చివరి ఓవర్ లో ఐదు పరుగులు కావాల్సిన తరుణంలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆ తరుణంలో క్రీజ్ లో స్టువర్ట్ బిన్నీ(16), ఫాల్కనర్(6) పరుగులు చేసి రాయల్స్‌కు విజయాన్ని అందించారు. కడవరకూ సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతిని ఫల్కనర్ ఫోర్ కొట్టడంతో రాయల్స్  బతికి బయటపడింది. దీంతో రాజస్థాన్ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‍ల్లో విజయం సాధించి తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
 
రాజస్థాన్ ఆటగాళ్లలో సంజూ శాంసన్(26), స్టీవ్ స్మిత్(13), కరుణ్ నాయర్ (1) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరినా.. ఓపెనర్ అజ్యింకా రహానే (62) పరుగులు చేసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  హైదరాబాద్ బౌలర్లలో  రవి బొపరాకు రెండు వికెట్లు దక్కగా, కేవీ శర్మ, బౌల్ట్ లకు తలో  ఒక వికెట్ లభించింది. అంతకుముందు టాస్ ఓడిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments