మ్యాక్స్ వెల్ వ‌ల్లే వార్న‌ర్ అవుట్ అయ్యాడా? నెటిజన్ ఫైర్

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (21:17 IST)
David Warner
టీ-ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంగా గురువారం రాత్రి రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అవుట్ అయినా విధానంపై అభిమానులు ప‌లు ర‌కాలుగా స్పంధిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్న‌ర్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌నతో ఆక‌ట్టుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అవుట్ అయినా.. వార్న‌ర్ త‌న దూకుడు అయిన ఆట‌తో ప‌రుగుల బోర్డును ప‌రుగులు పెట్టించాడు.
 
అయితే 49 ప‌రుగుల వ‌ద్ద‌ డేవిడ్ వార్న‌ర్ పాక్ బౌల‌ర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఈ క్యాచ్‌పై క్రికెట్ అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ‌చ్చాయి. అయితే డేవిడ్ వార్న‌ర్ ఈ అవుట్‌పై రివ్యూ తీసుకోకుండా పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. దీనిపై ఆస్ట్రేలియా ఆట‌గాడు మ‌థ్యూ హెడ్ స్పంధించాడు.
 
డేవిడ్ వార్న‌ర్ అవుట్ అయిన స‌మ‌యంలో మ‌రొప‌క్క బ్యాట‌ర్‌గా గ్లాన్ మ్యాక్స్ వెల్ బ్యాట్‌కు బంతి త‌గిలిన‌ట్టు శ‌బ్ధం వ‌చ్చింద‌ని వార్న‌ర్‌తో అన్నాడ‌ట‌. దీంతో డేవిడ్ వార్న‌ర్ రివ్యూ తీసుకోకుండా పెవీలియ‌న్ బాట ప‌ట్టాడ‌ని మాథ్యూ హెడ్ అన్నాడు. దీంతో మ్యాక్స్ వెల్ వ‌ల్లే వార్న‌ర్ అవుట్ అయ్యాడంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాక్‌పై విజ‌యం సాధించి ఫైన‌ల్‌కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments