Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ పిచ్‌కు పూజలు చేసిన ఎమ్మెస్కే.. నెట్టింట వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:16 IST)
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డేకు విశాఖ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా విశాఖలో జరిగిన వన్డే పిచ్‌పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పూజలు నిర్వహించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధాన పిచ్‌లో మూడు వికెట్లు పెట్టి పూజారితో ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
ఎమ్మెస్కేతో పాటు స్టేడియం ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే పిచ్‌పైకి ఇతరులు ప్రవేశించడం నిషేధం. అలాంటిది.. ప్రత్యేక పూజలు చేయించడం.. ఆ కార్యక్రమంలో ఇతరులు పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మ్యాచ్‌కు ముందు వీటిని పరిశీలించే అవకాశం కెప్టెన్లకు వున్నా.. కఠినమైన నిబంధనలు వుంటాయి. అలాంటిది పిచ్‌పైకి ఏకంగా పూజారిని తీసుకెళ్లి పూజలు నిర్వహించడం కలకలం రేపుతుంది.
 
అయితే సదరు వీడియోలో స్టేడియంలో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ పూజలు ఎప్పుడు జరిగాయనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వస్తుండటంతో బీసీసీఐ ఎమ్మెస్కే ప్రసాద్‌ను వివరణ కోరే అవకాశం ఉంది. మరోవైపు ఉత్కంఠభరితంగా సాగినన మ్యాచ్ టై గా ముగిసిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments