Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ అలసిపోయాడు.. అభిమానితో నో సెల్ఫీ.. బ్యాగ్ పడిపోయినా కారు దూసుకెళ్లిందా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో ఆడుకుంటున్నాడు. కెప్టెన్‌గా అలసిపోయి.. క్రికెటర్‌గా కొనసాగుతున్న ధోనీకి కూల్ కెప్టెన్ అనే పేరుంది. అయిత

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (16:50 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో ఆడుకుంటున్నాడు. కెప్టెన్‌గా అలసిపోయి.. క్రికెటర్‌గా కొనసాగుతున్న ధోనీకి కూల్ కెప్టెన్ అనే పేరుంది. అయితే ప్రస్తుతం ధోనీ అలిసిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్‌కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఫ్యాన్స్‌తో సెల్ఫీ తీసుకోవాలంటేనే అబ్బా అనుకుంటున్నాడు. అలాంటి ఘటనే.. జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. 
 
విజయ్ హజారే ట్రోఫీ ముగించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, కోల్ కతా నుంచి జార్ఖండ్ చేరుకున్నాడు. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం బయట తన వాహనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో 35ఏళ్ల ఓ మహిళాభిమాని ధోనీతో సెల్ఫీ దిగి, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ అప్పటికే ధోనీ అలసిపోయాడు. అందుకు నిరాకరించాడు. తన కారు రావడంతో అందులో ఎక్కేశాడు. కానీ ఆ ఫ్యాన్ మాత్రం పట్టు వదలకుండా ధోనీ వాహనానికి అడ్డు తగిలింది.  దీంతో, వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది, ఆమెను పక్కకు వెళ్లమని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో సిబ్బందికి, ఆ మహిళకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళ హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోవడంతో, దానిని తీసుకునేందుకు పక్కకు వెళ్లడంతో ధోనీ కారు దూసుకుపోయింది. అయితే, ఆ హ్యాండ్ బ్యాగుపై నుంచి వాహనం వెళ్లినట్టు గుర్తించిన ధోనీ, తన కారు ఆపి, డోర్ తీసి వెనక్కి చూశాడు. ఎటువంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించుకున్న తర్వాత  ధోనీ వెళ్లిపోయాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments