Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. సాహా స్థానంలో పార్థీవ్ పటేల్‌కు చోటు..

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ మంగళవారం 16 సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (10:42 IST)
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ మంగళవారం 16 సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. తాజాగా జట్టులో ఒక మార్పు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

వికెట్‌ కీపర్‌ సాహా స్థానంలో పార్థీవ్‌ పటేల్‌కు చోటు కల్పించింది. ఈ మార్పు మొహాలీ వేదికగా జరిగే మూడో టెస్టుకు మాత్రమే అని బీసీసీఐ ట్విట్టర్‌లో పేర్కొంది. సాహా గాయం బారిన పడటంతో ఈ మార్పు చేసినట్లు బీసీసీఐ ట్విటర్‌లో తెలిపింది.
 
ఇదిలా ఉంటే.. విశాఖ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. భారత్ 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ 158 పరుగులకే కుప్పకూలింది.

భారత్ తొలి ఇన్సింగ్స్‌లో 455, రెండో ఇన్సింగ్స్‌లో 205 పరుగులు చేయగా, ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్‌లో 255, రెండో ఇన్సింగ్స్‌లో 158 పరుగులు చేసింది. రెండు ఇన్సింగ్స్‌ల్లోనూ అశ్విన్ 8 వికెట్లు పడగొట్టాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వీల్‌చైర్‌లో సీఎం సిద్ధరామయ్య - చేయిపట్టుకుని కలియతిరిగిన రాజ్‌నాథ్ (Video)

అగస్త్య మహర్షి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

Prudhvi Raj: 150 మేకలు 11 మేకలు.. వైకాపా వాళ్లు రోడ్డు మీద పందులకు పుట్టారా? (video)

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కీలక నిర్ణయం...

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఇకలేరు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో ఎదురయ్యే ప్రమాదాలు కథా వస్తువుగా రామ్ గోపాల్ వర్మ చిత్రం శారీ

నా ఎనర్జీకి బన్నీ ఫర్ఫెక్ట్ మ్యాచ్ : రష్మిక మందన్నా

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

తర్వాతి కథనం
Show comments