Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులు లేకుండానే ఐసీసీ ప్రపంచ కప్ పోటీ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (10:36 IST)
వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు భారత్ వేదికగా జరుగున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, టోర్నీకి ముందు ఆయా జట్లు సన్నాహక మ్యాచ్‌లను ఆడునున్నాయి. ఇందులో భాగంగా, ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. 
 
అయితే, ఈ ప్రాక్టీసు మ్యాచ్‌పై పోలీసులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో నగరంలో గణేశ్ నిమజ్జనం ఉండడంతో, ఆ దిశగా మరింత భద్రతను అందించాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేట్టయితే అత్యధిక సంఖ్యలో పోలీసులతో భద్రత అందించాల్సి ఉంటుందని, గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో తాము పెద్ద సంఖ్యలో పోలీసులతో భద్రత కల్పించలేమని తేల్చి చెప్పారు. 
 
దీంతో పాక్-కివీస్ వార్మప్ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే జరుపుకోవాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) పెద్దలకు పోలీసులు వివరించారు. పోలీసుల సూచనలను హెచ్‌సీఏ పాటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 1,500 టికెట్లు విక్రయించినప్పటికీ, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరపడానికే హెచ్‌సీఐ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments