Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు.. మీరే అతి చేస్తున్నారు.. : మీడియాపై సందీప్ పాటిల్ రుసరుసలు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (12:07 IST)
భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ, వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గునమండిపోతుందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ స్పందించారు. ధోనీ, కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలులేవన్నారు. 
 
బంగ్లాదేశ్ పర్యటన సమయంలో ధోనీ నిర్ణయాలను కోహ్లీ వ్యతిరేకించాడన్న కథనాలు అవాస్తవమని అన్నారు. అంతా మీడియా సృష్టి అని ఆరోపించారు. ఇక, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమి అనంతరం ధోనీ కెప్టెన్సీపై బోర్డులో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అటు, జట్టులోనూ ఎలాంటి విభేదాలు లేవన్నారు. 
 
అలాగే, వీరిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉందన్నారు. ధోనీ, కోహ్లీ మధ్య విభేదాలు లేవని తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ పర్యటనలో వీరిద్దరి మధ్య విభేదాలు చెలరేగాయని, డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అవన్నీ ఊహాజనిత వార్తలని, విభేదాలన్నీ మీడియా వార్తల్లోనేనని చెప్పారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments