Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌‌తో ఇక క్రికెట్ మ్యాచే వద్దు.. (video)

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (17:33 IST)
ముంబై దాడుల అనంతరం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్‌‌ జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌కు పాక్ క్రికెటర్లు దూరమవగా... పాకిస్థాన్ పీఎస్ఎల్‌కు భారత ఆటగాళ్లు దూరంగా వుంటున్నారు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.


ప్రస్తుతం పుల్వామా ఘటన జరగడంతో భారత్.. కఠినమైన నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు విదేశీ గడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ వచ్చిన భారత్-పాకిస్థాన్ జట్లు.. ఇక కలిసి ఆడే ఛాన్స్ లేనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వాణిజ్య సంబంధాలు తెగిపోయాయి. ఇంకా భారత్‌లోని ఐపీఎల్ తరహాలో జరిగే పీఎస్ఎల్ క్రీడా పోటీల ప్రసారం భారత్‌లో ప్రసారం కాబోదని తేలిపోయింది. 
 
ఇంకా పాకిస్థాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్.. భారత క్రికెట్ మండలిలో ఓ సభ్యుడిగా వ్యవహరించేవారు. కానీ పుల్వామా ఘటన నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్‌ను మండలి జట్టు నుంచి తొలగించారు. అలాగే ఇండోర్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ క్రికెటర్ల సాధించిన రికార్డులను బోర్డుపై వారు సాధించిన వివరాలు వుండేవి. ఆ స్టేడియంలో పాక్ క్రికెటర్ల ఫోటోలతో కూడిన వివరాలను ఇండోర్ స్టేడియం తొలగించారు.

ఇకపోతే.. వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు జూన్ 14తేదీ బరిలోకి దిగనున్నాయి. కానీ పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడదని తెలుస్తోంది. ఈ మ్యాచే కాకుండా ఇక భవిష్యత్తులో ఏ మ్యాచ్ కూడా పాకిస్థాన్‌లో భారత్ ఆడబోదని సమాచారం. అదే జరిగితే దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ వుండబోదని క్రీడా పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments