Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో ఇంత లుకలుకలా? పెద్దమనిషి కుంబ్లే దూకుడు కోహ్లీకి నచ్చలేదా?

రత క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని సంచలనం. సాక్షాత్తూ కోచ్ అనిల్ కుంబ్లే అంటే టీమ్ లోని సీనియర్ ఆటగాళ్లకు నచ్చడం లేదన్న వార్తలు సంచలనం కలిగించాయి. తరాల మధ్య గ్యాప్ అనేది ఎక్కడైనా పనిచేస్తుందని సీనియర్ కోచ్‌కి, యవ్వనంలో ఉన్న కెప్టెన్, తదితర ఆటగాళ్లక

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (02:16 IST)
భారత క్రికెట్  చరిత్రలో కనీవినీ ఎరుగని సంచలనం. సాక్షాత్తూ కోచ్ అనిల్ కుంబ్లే అంటే టీమ్ లోని సీనియర్ ఆటగాళ్లకు నచ్చడం లేదన్న వార్తలు సంచలనం కలిగించాయి. తరాల మధ్య గ్యాప్ అనేది ఎక్కడైనా పనిచేస్తుందని సీనియర్ కోచ్‌కి, యవ్వనంలో ఉన్న కెప్టెన్, తదితర ఆటగాళ్లకు మధ్య అభిప్రాయ భేదాలకు దృక్పథంలో తేడాలే కారణమని లెజెండరీ క్రికెటర్లు ఎంతగా సర్ది చెబుతున్నప్పటికీ సరిగ్గా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోతున్న టీమిండియాకు ఇది మించిది కాదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దీంతో వేగంగా స్పందించిన భారత క్రికెట్ బోర్డు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని నిర్ణయించింది.
 
మీడియాలో వస్తున్న వార్తల పట్ల స్పందించిన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా జట్టు కెప్టెన్, కోచ్‌ ఒకేలా ఆలోచిస్తారనుకోవడం సరికాదని, అలా ఎప్పుడూ జరగదని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నారు. కోహ్లి, కుంబ్లే మధ్య విభేదాల గురించి స్పందిస్తూ.. ‘అదంతా నిజమో కాదో తెలీదు కానీ చాంపియన్స్‌ ట్రోఫీ ముందు ఈ పరిస్థితి ఉండకూడదు. కచ్చితంగా కోచ్‌ అనే వ్యక్తి ప్రస్తుత తరంకన్నా ముందు ఆడినవారై ఉంటారు. అందుకే వారి దృక్పథం వేరేలా ఉంటుంది. ఇక జట్టు విజయాల గురించి మాట్లాడితే కుంబ్లే అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతీ కోచ్‌ జట్టు 10 ఏళ్ల భవిష్యత్‌ను ఊహించి పనిచేయాలి. కెప్టెన్, కోచ్‌లతో సీఏసీ సభ్యులు మాట్లాడతారని అనుకుంటున్నాను’ అని గావస్కర్‌ చెప్పారు.
 
చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా కీలకమైన పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టులో నెలకొన్న విభేదాలపై బీసీసీఐలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంట్లో భాగంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకు బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, క్రికెట్‌ ఆపరేషన్స్‌ జీఎం ఎంవీ శ్రీధర్‌ను నియమించారు. వీరు బర్మింగ్‌హామ్‌లో ఇద్దరితో విడివిడిగా సమావేశమై విభేదాలను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నం చేయనున్నారు. 
 
మరోవైపు కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను ఈనెల 4న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ ప్రారంభించనుంది. మే 31తో అభ్యర్థుల దరఖాస్తుల గడువు ముగిసింది.  చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆలోపునే జట్టు కోచ్‌ ఎవరనేది తేలిపోతుందని బోర్డు స్పష్టం చేసింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments