విండీస్ పర్యటనలో ధోనీ బిజీ... మాజీ దిగ్గజాలతో భేటీ

Webdunia
బుధవారం, 13 జులై 2022 (12:22 IST)
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ బిజీగా గడుపుతున్నారు. ఆయన వింబుల్డన్ మ్యాచ్‌ను  వీక్షించడంతోపాటు ధోనీ బర్త్‌డే వేడుకలను కూడా లండన్‌లోనే జరుపుకున్నాడు. 
 
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ సందర్భంగా యువ ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించిన ధోనీ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లోనూ మెరిశాడు. 
 
ధోనీతోపాటు విండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ గార్డన్‌ గ్రీనిడ్జ్‌, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌తో కలిసి ఇంగ్లాండ్‌తో వన్డే మ్యాచ్‌ను వీక్షించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
కాగా, తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బుమ్రా (6/19) విజృంభణతో ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (75*), శిఖర్ ధావన్‌ (31*) తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. దీంతో భారత్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

బెట్టింగ్ యాప్స్ కేసు: నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖిల వద్ద విచారణ ఎలా జరిగింది?

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments