Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ దూకుడుకు డీకాక్ బ్రేక్?: రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ధోనీ!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (17:43 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీలతో దూసుకెళ్తున్నాడు. సచిన్ సెంచరీల రికార్డు బద్ధలుగొట్టే సత్తా ఉన్న ఏకైక క్రికెటర్‌ కోహ్లీ అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అయితే కోహ్లీ కంటే దూకుడైనా ఆటగాడు చాపకింద నీరులా దూసుకొస్తున్నాడు. డివిలియర్స్, అమ్లా, మిల్లర్, డుమిని వంటి వారి చాటున ఎదుగుతున్న సఫారీ ఓపెనర్ డీకాక్ సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు. 
 
అత్యంత వేగవంతమైన పది సెంచరీలు చేసిన ఆటగాడిగా డీకాక్ నిలిచాడు. కేవలం 50 వన్డేలలో డీకాక్ పది సెంచరీలు చేయడం విశేషం. పది సెంచరీలు చేసేందుకు కోహ్లీకి 80 ఇన్నింగ్స్ అవసరం కాగా, డీకాక్ అంతకంటే ముందే పది సెంచరీలు చేసి 57 ఇన్నింగ్స్‌లో పది సెంచరీలు నమోదుచేసి ఆమ్లా పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. 
 
ఇకపోతే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. 2014లో టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ధోనీ ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్ ఫిక్స్ చేశాడని సన్ స్టార్ అనే హిందీ పత్రిక రాసింది. దీంతో ఆయన ఆ పత్రికపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే ఆ పత్రికకు 9 పేజీల లీగల్ నోటీసులు పంపారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో తనను మానసిన క్షోభకు గురిచేశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments