Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి మళ్లీ వన్డే సారథ్య పగ్గాలు.. అరుదైన గౌరవం.. ఎలాగంటే? (వీడియో)

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (16:35 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించిన ఈ దశాబ్ధపు ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ జట్టుకు ధోనీ సారథిగా ఎంపికయ్యాడు. ధోనీతో పాటు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లనూ చేర్చింది. ఈ జట్టులో ఒకే ఒక్క ఆసీస్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ మాత్రమే వుండడం గమనార్హం. 
 
ఇక సీఏ ప్రకటించిన ఈ దశాబ్ధపు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో దక్షిణాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, బంగ్లాదేశ్‌కు చెందిన షకీబుల్ హసన్, ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్, శ్రీలంక నుంచి లసిత్ మలింగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి రషీద్ ఖాన్, న్యూజిలాండ్ నుంచి ట్రెంట్ బౌల్ట్‌కు చోటు దక్కింది. ఇక సీఏ టెస్టు జట్టుకు మాత్రం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరునే ప్రకటించడం విశేషం. 
 
2010-2019 సీఏ వన్డే జట్టు: ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌-వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ, హషీమ్‌ ఆమ్లా, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, షకీబుల్‌ హసన్‌, జోస్‌ బట్లర్‌, రషీద్‌ ఖాన్‌, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లసిత్‌ మలింగా.
 
2010-2019 సీఏ టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), అలెస్టర్‌ కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌ (వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, నాథన్‌ లయన్‌, జేమ్స్‌ అండర్సన్‌.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments