ఇక ఆపండయ్యా మీ విమర్శల గోల.. ధోనీ ఓ లెజండ్: కోహ్లీ

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (14:00 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ వెనకేసుకొచ్చాడు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరువైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్ సరిగ్గా చేయలేదని.. వేగం కొరవడిందని వీవీఎస్ లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ స్పందించాడు. 
 
ధోనీ మ్యాచ్ చివరి వరకు వుంటే ఏం చేయగలడో అందరికీ తెలుసునని కోహ్లీ ప్రశంసించాడు. ఒక్క రోజు విఫలమైన మాత్రానా ఆతనిపై విమర్శలు చేస్తారు. తాము మాత్రం ధోనీకి మద్దతుగా వుంటామని చెప్పాడు. భారత్‌కు అతడు ఎన్నో విజయాలు అందించాడు. టెయిలెండర్స్‌తో కలిసి ఎలా బ్యాటింగ్ చేయాలో మహీకంటే బాగా ఎవరికీ తెలియదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. 
 
జట్టుకు ఎంత స్కోరు చేస్తే సరిపోతుందో అతడు కచ్చితంగా చెప్పగలడు. అతడు 265 పరుగులు సరిపోతాయంటే మేమేం 300 కోసం ఆడమన్నాడు.  అలాగని 230తో సరిపెట్టుకోం. అతడు క్రికెట్‌ దిగ్గజం అన్న సంగతి మాకు తెలుసునని కోహ్లీ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments