Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ గాయంతోనే ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు : కోచ్ ఎరిక్ సిమన్స్

సెల్వి
సోమవారం, 15 ఏప్రియల్ 2024 (17:10 IST)
Dhoni
వాంఖడే వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్టార్ ప్లేయర్ ధోనీ విజృంభించాడు. నాలుగు బంతుల్లో 20 పరుగులు సాధించాడు. తద్వారా ముంబైపై చెన్నై గెలిచేందుకు కీలకంగా మారింది. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. వైజాగ్ మ్యాచ్‌లో తన కాలికి ప్రత్యేకమైన పట్టీతో ధోనీ కనిపించాడు.
 
తాజాగా ఆ నొప్పిని భరిస్తూనే ముంబైపై హిట్టింగ్ చేశాడని.. చెన్నై బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ తెలిపాడు. ముంబై బౌలింగ్‌కు ధీటుగా ధోనీ ఆడటం ఆశ్చర్యంగా అనిపించింది. 
 
జట్టు స్కోర్ ఒకే ఒక్క ఓవర్‌తో 206 పరుగులకు చేరింది. క్రీజులోకి దిగడంతోనే ధోనీ సిక్సర్లు కొట్టాడు. గత ఐపీఎల్ తర్వాత ధోనీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడప్పుడు మళ్లీ నొప్పి తిరగబడుతోంది. 
 
అయినా సరే అభిమానుల కోసం బ్యాటింగ్ చేస్తున్నాడు ధోనీ.. ఇప్పటివరకు తాను చూసిన క్రికెటర్లలో ధోనీ అరుదైన వ్యక్తి అని కోచ్ తెలిపాడు. ఈ నొప్పితో కూడా కెరీర్‌లో కొనసాగుతాడా లేదా అనేది చెప్పలేం. ఎందుకంటే.. ధోనీ నిర్ణయం అంత కచ్చితంగా వుంటుంది.. అంటూ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

9 మంది దొంగలు, ఒక్కడే కమాండర్: టీవీకె విజయ్

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments