Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని కలవాలని వెళ్తే పోలీసులు దెబ్బలు తినాల్సి వచ్చింది.. చివరికి ఇలా..?

Webdunia
సోమవారం, 5 జులై 2021 (14:59 IST)
Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని వీరాభిమాని అతడు. ఒక్కసారైనా ధోనిని నేరుగా కలవాలన్నది అతడి చిరకాల కోరిక. ఇందుకోసం ఏకంగా తను పనిచేసే ఊరి నుంచి మరో చోటుకు బదిలీ చేయించుకున్నాడు దేవ్‌. 
 
పదహారేళ్ల తర్వాత ఎట్టకేలకు తన అభిమాన ఆటగాడిని కలుసుకున్నాడు. కరోనా కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అర్ధంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో ఇంటికి చేరుకున్న ధోని, కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి అతడు ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో రత్నారీలోని మీనాభాగ్‌ హోటల్‌లో ధోని కుటుంబం బస చేసింది.
 
అదే హోటల్‌ మరో బ్రాంచీలో పనిచేస్తున్న దేవ్‌... ఈ విషయం తెలుసుకుని.. తనను షిమ్లా నుంచి రత్నారీ బదిలీ చేయాల్సిందిగా పై అధికారులను కోరాడు. దేవ్‌ అభ్యర్థనను వారు మన్నించడంతో రత్నారీ వచ్చి ధోని కలుసుకున్నాడు. ధోనితో ఫొటో దిగడంతో పాటుగా, తన ఫోన్‌ కవర్‌పై అతడి ఆటోగ్రాఫ్‌ కూడా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీనాభాగ్‌ యాజమాన్యం తమ ఇన్‌స్టా పేజీలో పంచుకుంది. 
 
2005లో రోహ్రు(హిమాచల్‌ ప్రదేశ్‌)లో క్రికెట్‌ టోర్నీ జరుగుతున్న సమయంలో దేవ్‌.. ధోనిని కలిసేందుకు వెళ్తే.. పోలీసులు దెబ్బలు తినాల్సి వచ్చిందని, ఇప్పుడు ఇదిగో ఇలా అతడిని కలిసే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

తర్వాతి కథనం
Show comments