Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలుపులు తిరుగుతున్న మోతేరా టెస్ట్ : 145 రన్స్‌కు భారత్ ఆలౌట్

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:59 IST)
అహ్మదాబాద్‌లోని మోతేరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నిగ్స్‌‍లో భారత్ కూడా 145 రన్స్‌కు చాపచుట్టేసింది. దీంతో భారత్‌కు కీలకమైన 33 పరుగుల ఆధిక్యం మాత్రం దక్కింది. 
 
నిజానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు సాధిస్తుందని భావించినా, రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడం విశేషంగా నిలిచింది.
 
రూట్ 6.2 ఓవర్లు విసిరి 8 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అందులో మూడు మెయిడెన్లు ఉన్నాయి. పార్ట్ టైమ్ బౌలర్‌ గా సేవలందించే రూట్... స్పిన్‌కు విశేషంగా సహకరిస్తున్న పిచ్‌పై ప్రధాన బౌలర్లను మించిపోయి బౌలింగ్ చేశాడు. 
 
రూట్ బంతులను ఎదుర్కొనేందుకు టీమిండియా లోయర్ ఆర్డర్ ఆపసోపాలు పడింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఒక్కరే గరిష్టంగా 66 పరుగులు చేశాడు. ఆ తర్వాత కోహ్లీ 27 పరుగులు చేయగా, అశ్విన్ 17 పరుగులు సాధించాడు. 
 
ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ్టి ఆటలో భారత్ పతనాన్ని ప్రారంభించింది లీచ్ కాగా, రూట్ ముగింపు పలికాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆండర్సన్, బ్రాడ్, ఆర్చర్ రూపంలో ముగ్గురు పేసర్లను తీసుకోగా, వారు నామమాత్రంగా మిగిలారు. ఆర్చర్ మాత్రం ఒక్క వికెట్ తీశాడు. మిగతా 9 వికెట్లను రూట్, లీచ్ పంచుకున్నారు.
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఈ రెండు వికెట్లను పడగొట్టాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments