Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 ప్రపంచకప్‌లో సంచలన రికార్డ్.. ఆరు వికెట్లు, పది పరుగులకే ఆలౌట్

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (11:33 IST)
బాంగీలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్-ఏలో సంచలన రికార్డ్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో మంగోలియా జ‌ట్టు 10 పరుగులకే ఆలౌట్ అయింది. సింగ‌పూర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు త‌క్కువ స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. 
 
దీంతో పురుషుల టీ20లో అత్యల్ప స్కోరును సమం చేసింది. గతేడాది స్పెయిన్‌పై ఐల్ ఆఫ్ మ్యాన్ కూడా ఇలాగే ప‌ది ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దాంతో ఇప్పుడు ఆ అత్య‌ల్ప స్కోర్‌ రికార్డు స‌మం అయింది.
 
ఇక మంగోలియా ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. సింగపూర్ బౌల‌ర్ల‌లో హర్ష భరద్వాజ్ 6 వికెట్ల‌తో విజృంభించాడు. నాలుగు ఓవర్లు వేసిన అత‌డు కేవ‌లం మూడు ప‌రుగుల‌కే 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 
 
17 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ త‌న మొద‌టి ఓవ‌ర్‌లోనే రెండు వికెట్లు ప‌డగొట్టడం విశేషం. అలాగే పవర్‌ప్లేలో మంగోలియా కోల్పోయిన ఆరు వికెట్లలో ఐదు వికెట్లు భ‌ర‌ద్వాజే తీశాడు. అనంతరం సింగపూర్ 11 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఐదు బంతుల్లోనే ఛేదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments