Webdunia - Bharat's app for daily news and videos

Install App

హసీన్‌కు పెళ్లైందని.. ఇద్దరు పిల్లలున్నారని తెలిసి షాకయ్యా: మహ్మద్ షమీ

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా షమీ తన భార్య హసీన్‌కు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. తనను వివాహం చేసుకునేందుకు ముందే హసీన్‌కు పెళ్లైందని.. ఇద్దర

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (18:12 IST)
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా షమీ తన భార్య హసీన్‌కు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. తనను వివాహం చేసుకునేందుకు ముందే హసీన్‌కు పెళ్లైందని.. ఇద్దరు పిల్లలు వున్నారనే విషయం తనకు తెలియదన్నాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకుందని.. పిల్లలు ఎవరని అడిగితే.. చనిపోయిన తన సోదరి పిల్లలంటూ అబద్ధాలు చెప్పిందని షమీ అన్నాడు. హసీన్ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి.. పెళ్లి చేసుకున్నట్లు షమీ తెలిపాడు. 
 
పెళ్లైన కొంతకాలానికే అసలు విషయం చెప్పిందని.. ఆమెకు పెళ్లైందని.. ఇద్దరు పిల్లలున్నారనే విషయం తెలుసుకుని షాక్ తిన్నానని షమీ చెప్పుకొచ్చాడు. కాగా 2002లో హసీన్ జహాన్‌కు ఫషీయుద్ధీన్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం వున్నారు. ఫషీయుద్ధీన్‌తో విభేదాలు తలెత్తడంతో 2010లో అతనికి దూరమైన హసీన్.. 2012తో షమీని పరిచయం చేసుకుని.. 2014లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఓ పాప వుంది. కాగా షపీయుద్ధీన్-హసీన్ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. 
 
వీరిలో పెద్ద పాప ప్రస్తుతం పదకొండో తరగతి చదువుతోంది. హసీన్-షమీ వివాహానంతరం షపీయుద్ధీన్ వద్దకే వారిద్దరూ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో షమీ తన కుమార్తెలను ప్రేమగా చూసుకునేవాడని షపీయుద్ధీన్ తెలిపాడు. ఈ ప్రేమతోనే తన పెద్ద కూతురు వారిద్దరూ కలిసి జీవించాలని.. విడిపోకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు షఫీయుద్ధీన్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

తర్వాతి కథనం
Show comments