Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకులు: ఒక్కసారిగా టాప్-10లోకి దూసుకొచ్చిన షమీ

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (17:46 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో టాప్-10లోకి భారత్ బౌలర్ మహ్మద్ షమీ ఒక్కసారిగా దూసుకొచ్చాడు. నిజానికి గత కొంతకాలంగా మహ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెల్సిందే. ఈయన ఐసీసీ ర్యాంకుల జాబితాలో ఒక్కసారిగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. 
 
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టాప్-10 జాబితాలో షమీ 7వ ర్యాంకు దక్కించుకున్నాడు. గత కొన్నినెలలుగా షమీ అంత నిలకడగా బౌలింగ్ చేస్తున్న ప్రపంచస్థాయి బౌలర్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 
 
స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపైనా షమీ చెలరేగుతున్న తీరు క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీమిండియా నెంబర్ వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలేని లోటు ఏమాత్రం తెలియడంలేదంటే అది నిస్సందేహంగా షమీ చలవే.
 
ఐసీసీ బౌలర్ల జాబితాలో టాప్‌లో ఆస్ట్రేలియా యువ పేసర్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రబాడా, జాసన్ హోల్డర్ ఉన్నారు. గాయం కారణంగా కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరమైన బుమ్రా నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు పదో స్థానం దక్కింది.
 
ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత సారథి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. పుజారా 4, రహానే 5 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా టెస్టు జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కించుకున్న రోహిత్ శర్మ పదో ర్యాంకులోకి చేరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments