Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ రికార్డుకు చేరువవుతున్నా గుర్తింపుకు ఆమడదూరంలో మిథాలీ రాజ్

మైదానంలో ప్రశాంతంగా కదులుతూ ఆటను ప్రత్యర్థి జట్టునుంచి లాగిపడేయడంలో మిస్టర్ కూల్ ధోనీని మించిన ప్లేయర్ ఆమె. టీమ్ ఇండియా కెప్టెన్ 19 ఏళ్లుగా భారత్ తరపున ఆడుతూ సుదీర్ఘ క్రీడా జీవితం గడిపినా నిన్న గాక మొన్న జట్టులో చేరిన హార్దిక్ పాండ్యాకు ఉన్న గుర్తిం

Webdunia
శనివారం, 8 జులై 2017 (03:10 IST)
మైదానంలో ప్రశాంతంగా కదులుతూ ఆటను ప్రత్యర్థి జట్టునుంచి లాగిపడేయడంలో మిస్టర్ కూల్ ధోనీని మించిన ప్లేయర్ ఆమె. టీమ్ ఇండియా కెప్టెన్ 19 ఏళ్లుగా భారత్ తరపున ఆడుతూ సుదీర్ఘ  క్రీడా జీవితం గడిపినా నిన్న గాక మొన్న జట్టులో చేరిన హార్దిక్ పాండ్యాకు ఉన్న గుర్తింపు కూడా లేదంటే క్రీడల్లో మన దేశంలో ఇంకా కొనసాగుతున్న వివక్షను చూసి బాధపడాలో, మహిళా క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఆగ్రహించాలో అర్థం కావడం లేదు.. ఈ వివక్షలకు అతీతంగా మైదానంలోకి దిగిన ప్రతిసారూ నూటికి నూరుపాళ్లూ అంకిత భావం ప్రదర్శిస్తూ  టీమ్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్న ఘనత మిథాలీ రాజ్‌ది. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా పురుషుల జట్టులో ఏ ఒక్కరికీ లేనంత సీనియారిటీ ఆమెకుంది. సీనియర్ ఆటగాడు ధోనీ సైతం 13 ఏళ్లనుంచే భారత్‌ తరపున ఆడుతుండగా 19 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోస్ట్ సీనియర్ క్రికెటర్ మిథాలి.
 
భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉంది. ఈ పరుగుల రాణి 34 పరుగులు చేస్తే మహిళల క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగుల సాధించిన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ షార్లెట్ ఎడ్వర్డ్స్(5992) పేరిట ఉంది. ఈ ఘనత షార్లెట్‌ 191 మ్యాచుల్లో సాధించగా, మిథాలీ 181 మ్యాచుల్లో  5959 పరుగులు చేసింది.
 
శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో మిథాలీ చెలరేగితే అత్యధిక పరుగులతో పాటు తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించిన లేడిగా చరిత్రనెక్కనుంది. అంతేగాకుండా 6 వేల పరుగుల మైలు రాయి దాటిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందనుంది. మిథాలీ చాంపియన్స్‌ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తోంది. గత నాలుగు మ్యాచుల్లో 71, 46, 8, 53 లతో రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇక రేపు జరిగే మ్యాచులో రాణించి వరల్డ్‌ రికార్డుతో పాటు ప్రపంచ కప్‌  సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.
 
మిథాలీకి రికార్డులు కొత్తేమి కాదు. ఆమె ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. 1999లో ఐర్లాండ్‌పై మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇంత కాలం క్రికెట్‌ ఆడుతున్న మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె గుర్తింపు పొందింది. ఇక టెస్టుల్లో డబుల్ సెంచరీ, మహిళా టెస్టుల్లో 10 టెస్టులు ఆడటం ఆమె అదనపు రికార్డు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

తర్వాతి కథనం
Show comments