Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య కంటే ధోనీ ఇష్టం.. కానీ భారత్ శత్రుదేశమని?: చికాగో చాచా

పాకిస్థాన్ అభిమాని మహ్మద్ బషీర్ అకా (చికాగో చాచా) అంటే తెలియని వారుండరు. చికాగో చాచా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమాని. ప్రస్తుతం నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకకు వచ్చిన చాచా..

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (16:09 IST)
పాకిస్థాన్ అభిమాని మహ్మద్ బషీర్ అకా (చికాగో చాచా) అంటే తెలియని వారుండరు. చికాగో చాచా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమాని. ప్రస్తుతం నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకకు వచ్చిన చాచా.. ధోనీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన భార్య కంటే ధోనీ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని చాచా తెలిపాడు. చాచాతో పాటు భారత వీరాభిమాని సుధీర్, బంగ్లాదేశ్ ఫ్యాన్ షోయబ్ అలీలతో కలిసి మీడియాతో ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా చాచా మాట్లాడుతూ.. 2011 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ వరకు ధోని ఎవరో తనకు తెలియదన్నాడు. 2011 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం తాను మొహాలీ చేరుకున్నానని.. మ్యాచ్ టిక్కెట్లు లేకపోవడంతో తనకు మ్యాచ్ చూడాలని వుందని ప్లకార్డ్ ప్రదర్శించానని తెలిపాడు. అప్పుడు ఓ వ్యక్తి టికెట్స్‌ ఉన్న కవర్‌ తీసుకొచ్చి ఇస్తూ.. ఈ టికెట్లు ధోని పంపించాడని తెలిపాడు. 
 
అలా ధోనీ పంపిన టికెట్స్‌తో మ్యాచ్‌ను ఆస్వాదించానని చాచా చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ధోనీని తన భార్య కంటే ఎక్కువ ఇష్టపడుతున్నట్లు చెప్పాడు. ఆ క్షణం నుంచి భారత్ మ్యాచ్‌లు చూస్తూనే వున్నానని తెలిపాడు. 
 
కానీ చాలామంది భారత్‌కు ఎందుకు మద్దతిస్తున్నావని అడిగారు. అలా అడిగిన వారితో.. భారత్ నుంచే ఎక్కువ ప్రేమను పొందగలరని చెప్పానని చాచా చెప్పాడు. కానీ పాకిస్థాన్‌లో వృద్ధులంతా భారత్ శత్రుదేశమని యువకులకు నూరిపోయడం మంచిది కాదని చాచా చెప్పాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments