Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో దుబాయ్‌లో పార్టీ చేసుకున్న ధోనీ..

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (17:55 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుబాయ్‌లో పార్టీ చేసుకున్నాడు. ధోనీ తన భార్య సాక్షితో పాటు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, రాపర్‌ బాద్‌షా తదితరులతో కలిసి దుబాయ్‌లో బర్త్ డే పార్టీ  చేసుకున్నాడు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఆన్‌లైన్‌లో కనిపించిన ఒక వీడియోలో, హార్దిక్, ధోనీ వంటి వారు రాపర్ ట్రాక్‌కు స్టెప్పులేసినట్లు కనబడుతోంది. తన డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించడమే కాకుండా, రాపర్ పాడేటప్పుడు పాజ్ చేస్తున్నప్పుడు ప్రముఖ క్రికెటర్ కూడా వీడియోలో పాడటం కనిపించింది. బాద్షా తన సాధారణ పొడవాటి నలుపు జాకెట్ లుక్‌లో ఉండగా, హార్దిక్ సిల్క్ షర్ట్ ,ప్యాంటులో, ధోని బ్లాక్ సూట్‌లో ఉన్నారు.
 
2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు సంపాదించిపెట్టిన ధోనీ.. ఆపై టీ-20 సిరీస్‌లలో ధీటుగా రాణించాడు. జట్టును సక్సెస్ బాట పట్టించాడు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా వున్న ధోనీ..  గోల్ఫ్ సెషన్‌లలో, స్థానిక టెన్నిస్ టోర్నమెంట్‌లు ఆడుతున్నాడు. తన ఫ్యాన్సీ బైక్‌లు, కార్లను నడుపుతూ హ్యపీగా వున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఆడనున్న ధోనీ.. 2023 ఐపీఎల్‌కు కెప్టెన్సీ సారథ్యం వహిస్తాడని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments