Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ తప్పులతోనే సీఎస్కే రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది.. సెహ్వాగ్ (Video)

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (11:23 IST)
రాజస్థాన్ చేతిలో చెన్నై జట్టు ఓడిపోవడానికి కారణాలపై ప్రస్తుతం హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. అలాగే మహేంద్ర సింగ్ ధోనీ చేసిన తప్పుల వల్లే రాజస్థాన్ రాయల్స్ గెలిచిందని ఇప్పటికే ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. కేవలం క్రీడాభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధోనీ కెప్టెన్సీని గౌతమ్ గంభీర్ తప్పుబట్టగా.. తాజాగా ఆ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరిపోయారు. 
 
ఎంఎస్ ధోనీ చేసిన రెండు తప్పుల వల్లే రాజస్థాన్‌ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిందన్నారు. ఆ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీకి 10కి 4 మార్కులే ఇస్తానని స్పష్టం చేశారు సెహ్వాగ్. చివరి ఓవర్లో ధోనీ మూడు సిక్స్‌లు కొట్టిన తర్వాత చెన్నై విజయ తీరాలకు వెళ్లి ఓడిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవం వేరు. మధ్య ఓవర్లలో లక్ష్యాన్ని చేధించేందుకు ఎంఎస్ ధోనీ ఏమాత్రమూ ప్రయత్నించలేదని అనిపించిందని చెప్పుకొచ్చాడు సెహ్వాగ్  
 
కీలకమైన సమయంలో ఎన్నో బంతులను వదిలేశాడు. కరన్ ఔట్ అయిన తర్వాత ధోనీ బ్యాటింగ్ చేయాల్సింది. లేదంటే జడేజాను పంపించాల్సింది. మిడిల్ ఓవర్లలో రన్ రేట్ బాగా తగ్గింది. ఆ ఓవర్లలో కొంత మెరుగైన స్కోర్ సాధించి ఉంటే. చివరి ఓవర్లో 20-22 రన్స్ అవసరం ఉండేవి. అప్పుడు ధోనీ కొట్టి సిక్స్‌లు జట్టును గెలిపించేవి. ధోనీ అద్భుతంగా ఫినిష్ చేశాడని అందరూ మెచ్చుకునేవారు.
 
అంతేకాదు బౌలింగ్‌లోనూ ధోనీ తప్పులు చేశాడు. పరుగులు ఎక్కువగా ఇస్తున్నా జడేజా, పీయుష్ చావ్లాకు బాల్ ఇచ్చాడు. వారిద్దరి బౌలింగ్‌లోనే సంజు శాంసన్ భారీగా పరుగులు సాధించాడు. సంజూ శాంసన్‌కు స్పిన్నర్లతో బాలింగ్ వేయించి ఉండకూడదు. ఆ మ్యాచ్‌లో ధోనీ రెండు తప్పులు చేశాడు. ఒకటి శాంసన్‌కు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం, రెండోది.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం. ఆ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీకి నేనిచ్చే మార్కులు. 10కి 4 మాత్రమే.' అని సెహ్వాగ్ పేర్కొన్నారు.
 
ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్, ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా ధోనీ కెప్టెన్సీని తప్పుబట్టారు. అంత భారీ టార్గెట్ ఉన్నప్పుడే కెప్టెన్ ధోనీ ఏడో స్థానంలో ఎలా వస్తారని.. బ్యాటింగ్‌లో కాస్త ముందు రావాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీగల్స్‌తో జాగ్రత్త.. మహిళ చేతిలోని ఐస్‌క్రీమ్‌ను టేస్ట్ చేసిన పక్షి (video)

వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలి : వైఎస్ భారతి

ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల

ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు.. ఏకకాలంలో మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

తర్వాతి కథనం
Show comments