Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయన మంచి వంటగాడు.. పాస్తా సూపర్‌గా చేసేస్తాడు: సంగా వైఫ్

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2015 (15:26 IST)
''మా ఆయన మంచి వంటగాడు.. పాస్తా అద్భుతంగా చేసేస్తారు''..అని కుమార సంగక్కర శ్రీమతి యెహాలి వెల్లడించారు. 15 సంవత్సరాలుగా దేశం కోసమే ఆడారని.. ఆయన రిటైర్మెంట్ జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. క్రికెట్ నుంచి తప్పుకోవడం బాధాకరమంటూనే, కుటుంబం కోసం సమయం కేటాయించాల్సిన సమయం వచ్చిందని సంగా భార్య తెలిపారు. మ్యాచ్‌‌లు లేకుంటే ప్రతి క్షణం కుటుంబం కోసమే తపిస్తాడు. ఒంటరిగా ఉంటే మాత్రం పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తాడు. మంచి భర్త, మంచి తండ్రి... మొత్తమ్మీద ఫ్యామిలీ మ్యాన్ అని యెహాలీ చెప్పుకొచ్చారు. 
 
ఓ ఇంటర్వ్యూలో యెహాలీ మాట్లాడుతూ... "15 ఏళ్లుగా దేశం కోసమే ఆడాడు. అతని అద్భుతమైన కెరీర్ పట్ల ఎంతో సంతోషంగా ఫీలవుతున్నాను. ఇది సరైన సమయంలో ముగింపుగా భావిస్తున్నాను. వ్యక్తిత్వం విషయానికొస్తే సంగా ఎంతో మానసిక పరిపక్వత ఉన్నవాడు. క్రికెట్ గురించే కాదు, ఇతర అంశాలను సైతం ప్రతి కోణం నుంచి ఆలోచిస్తాడు. ఎంతటి సమస్యనైనా ఈజీగా తీసుకుంటాడు.
 
కష్టకాలంలోనూ నిబ్బరం కోల్పోవడం నేనెరుగను. వైవాహిక జీవితం అన్న తర్వాత భేదాభిప్రాయాలు తప్పవు. మేమూ అంతే. సంగా మనసులో ఏదీ పెట్టుకోడు. ఏదైనా గొడవపడితే నాదే పైచేయి (నవ్వుతూ). సంగా తానే కాస్త వెనక్కి తగ్గుతాడు. లోపల ఒకలా, బయట మరోలా వ్యవహరించడం సంగాకు తెలియదని సంగా శ్రీమతి చెప్పుకొచ్చారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments