Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫేవరేట్ కెప్టెన్లలో కోహ్లీ ఒకడు.. భారత క్రికెట్‌కు విరాట్ గొప్ప ఆస్తి: బెంగాల్ దాదా

టీమిండియా సంప్రదాయ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు స్టార్ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఖాతాలో బెంగాల్ దాదా, సౌరవ్ గంగూలీ కూడా చేర

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (14:35 IST)
టీమిండియా సంప్రదాయ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు స్టార్ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఖాతాలో బెంగాల్ దాదా, సౌరవ్ గంగూలీ కూడా చేరిపోయాడు. విరాట్ కోహ్లీని గంగూలీ ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుత క్రికెటర్లలో తన ఫేవరేట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడని గంగూలీ కొనియాడాడు. 
 
మైదానంలో పోరాట స్ఫూర్తితో పాటు విజయాన్ని ఆకాంక్షిస్తూ.. భారత క్రికెట్ విలువను పెంచుతున్నాడని గంగూలీ పేర్కొన్నాడు. అనతి కాలంలోనే దేశానికి ఎన్నో అద్భుతాలు సాధించిపెట్టాడని కితాబిచ్చాడు. కోహ్లీ అనసరం దేశానికి ఎంతో అవసరమని.. భారత క్రికెట్‌కు కోహ్లీ గొప్ప ఆస్తి అంటూ ప్రశంసించాడు. బ్యాటింగ్‌కు వెళ్లేప్పుడు గానీ, కెప్టెన్‌గా గానీ కోహ్లీ ఉత్తమ ప్రదర్శన చేయాలని పాటుపడతాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. 
 
ఇక, భారత-న్యూజిలాండ్‌ మధ్య త్వరలో మొదలయ్యే టెస్టు సిరీస్‌ గురించి మాట్లాడిన గంగూలీ.. ప్రస్తుతం ఇంగ్లండ్‌ తర్వాత రెండో ఉత్తమ జట్టు న్యూజిలాండేనని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో భారతను ఓడించడం అంత సులభం కాబోదన్న విషయం కివీస్‌తో పాటు అందరికీ బాగా తెలుసునని వ్యాఖ్యానించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

తర్వాతి కథనం
Show comments