Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ అవుట్ కావడం దురదృష్టమే.. అందుకని విమర్శలొద్దు: ద్రవిడ్

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (11:58 IST)
ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శనే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తొందరగా అవుట్ కావడం కేవలం దురదృష్టమేనని, ఇందులో విరాట్ తప్పేమీ లేదని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ వెనకేసుకొచ్చాడు. ఒక్క మ్యాచ్‌లో పరుగులు సాధించలేకపోతే విమర్శించడం సమంజసం కాదని, అంతకుముందు ఆస్ట్రేలియాపై మంచి గణాంకాలు విరాట్ నమోదు చేశాడని రాహుల్ గుర్తు చేశాడు. 
 
కీలకమైన సెమీస్ లో రాణించలేకపోవడం కోహ్లి దురదృష్టమని, ఇటువంటివి ఆటలో సహజమని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. వరల్డ్ కప్‌లో బలమైన జట్లే ఫైనల్‌కు వెళ్లాయని చెప్పాడు. సెమీస్ వరకు టీమిండియా ఎక్కడా తడబడలేదని తెలిపారు. ఆస్ట్రేలియా బలమైన జట్టు కావడం వల్లనే ఇండియా ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని ద్రావిడ్ తెలిపారు. కాగా, విరాట్ వైఫల్యం వెనుక అతని స్నేహితురాలు అనుష్క శర్మ కారణమని ఆరోపిస్తూ, వీరిద్దరిపై ఫేస్ బుక్, ట్విట్టర్లో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments