Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల్ దేవ్‌కు గుండె నొప్పి కాదు.. ఛాతినొప్పి..!?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (16:56 IST)
Kapil Dev
టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్ గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరలేదని ఛాతినొప్పితో ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసింది. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
 
ఛాతినొప్పితో కపిల్‌దేవ్‌ గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు యాంజీయోప్లాస్టీ చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ చేస్తామని వైద్యులు చెప్తున్నారు.
 
కపిల్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రా స్పందించారు. ప్రస్తుతం కపిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని చెప్పుకొచ్చారు. ఆయనకు గుండెపోటు వచ్చిందనేది వదంతులు మాత్రమేనని అశోక్‌ తెలిపారు.
 
కాగా.. దేశానికి ప్రపంచకప్‌ అందించిన తొలి కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ చరిత్ర సృష్టించాడు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన జట్టును 1983లో విశ్వవిజేతగా నిలపడంలో ఈ ‘హరియాణా హరికేన్‌‘ది కీలక పాత్ర. 61 ఏళ్ల కపిల్‌దేవ్‌ భారత్‌ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్లు సాధించాడు.
 
ఇకపోతే.. కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ ట్వీట్‌లు చేశారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments