Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకున్న హర్యానా హరికేన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (17:38 IST)
ఇటీవల ఛాతినొప్పికి గురైన హర్యానా హరికేన్, భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తిరిగి కోలుకున్నారు. దీంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేశారు. 
 
భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి, దేశానికి తొలి క్రికెట్ ప్రపంచ కప్‌ను అందించిన క్రికెట్ హీరో అయిన కపిల్ దేవ్‌కు ఇటీవల గుండెపోటు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఆయనను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కపిల్ కోలుకున్నారని, డిశ్చార్జ్ అయ్యారని మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
 
కాగా, ఇటీవల ఆసుపత్రిలో కపిల్‌ తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను కూడా ఆయనే పోస్టు చేసిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు చేతన్‌ శర్మ తెలుపుతూ ఆయనకు యాంజియో ప్లాస్టీ సర్జరీ చేసిన డాక్టర్‌ అతుల్‌ మథుర్‌తో కలిసి దిగిన ఫొటోను చేతన్‌ ఆదివారం పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

తర్వాతి కథనం
Show comments