Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ బెట్టింగ్.. కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టిన కలియుగ ధర్మరాజు.. ఎక్కడ?!

Webdunia
సోమవారం, 30 మే 2016 (16:10 IST)
ఐపీఎల్ బెట్టింగ్‌లో ఓడిపోయాడని కట్టుకున్న భార్యనే తాకట్టు పెట్టేశాడు ఓ కలియుగ ధర్మరాజు. ఈ వింత ఘటన యూపీలోని కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం గోవింద్ నగర్‌లో ఉంటున్న ఓ వ్యక్తి ఐపీఎల్ బెట్టింగులు కాస్తూ తన ఆస్తిని మొత్తం కోల్పోయాడు. ఆస్తిని పోగొట్టుకున్నా కూడా ఈ ప్రబుద్ధుడికి జూదంపై మోజు తీరక ఏకంగా తన భార్యను పణంగా పెట్టి బెట్టింగ్ కాసి ఓడిపోయాడు. దీంతో అతడిపై గెలిచిన గ్యాంబ్లర్స్ ఆ మహిళను వేధింపులకు గురిచేశారు. 
 
బెట్టింగ్‌లో ఓడిపోయిన నీవు మా కోరికలు తీర్చాలంటూ ఆ మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. ఆ గ్యాంబ్లర్స్ వేధింపులు భరించలేక ఆ మహిళ సామాజిక కార్యకర్తల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తరుచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, తన భర్తతోపాటు, గ్యాంబ్లర్స్‌పై పోలీసులకి ఫిర్యాదు చేసింది. అంతేకాదు పెళ్లైన ఐదేళ్లనుండి తనకి నరకం చూపిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 
 
పెళ్లైన మొదటిరోజే నగలు, విలువైన వస్తువులను బలవంతంగా తీసుకుని జూదం ఆడేవాడని.. ఈ ఐదేళ్లలో ఇంట్లో ఏ వస్తువు లేకుండా అమ్మేశాడని వాపోయింది. చివరికి తనని కూడా జూదంలో అమ్మకానికి పెట్టాడని కన్నీరుమున్నీరయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు. షేర్ మార్కెట్‌లో డబ్బులన్నీ పోగొట్టుకున్న నిందితుడు చివరకు ఐపీఎల్ బెట్టింగ్‌లో భార్యని ఓడిపోయాడని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments