Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న బుమ్రా.. వధువు ఎవరు..?

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (13:11 IST)
భారత స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. పెళ్లికోసమే బుమ్రా ఇంగ్లండ్‌‌తో జరిగే చివరి టెస్ట్ నుండి మాత్రమే కాదు వన్డే, టీ20 సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీకి చెప్పాడని సమాచారం. 
 
అయితే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల కోసం సెలవులు తీసుకున్నాడని తెలుస్తోంది. కాని పెళ్లి తేదీ గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అటు పెళ్లి కూతురు ఎవరనే విషయాన్ని కూడా రహస్యంగా ఉంచాడు ఇండియన్‌ బౌలర్‌.  
 
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌లో చాలా మంది భారత ఆటగాళ్లు పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా జస్‌ప్రీత్‌ బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. బూమ్రా పెళ్లి కేవలం కొద్దిమంది కుటుంబసభ్యులు, ప్రైవేట్ కార్యక్రమంలాగా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే వధువు ఎవరనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. త్వరలో పెళ్లికూతురు ఎవరనే విషయాలు బయటకు రానున్నాయి
 
కాగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు లేదన్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన బుమ్రా.. మార్చి 23 నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments