Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ నిర్ణయం చాలా గొప్పది : ద్రావిడ్ ప్రశంసలు

Webdunia
ఆదివారం, 26 జులై 2015 (15:23 IST)
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంకతో కీలక సిరీస్‌కు ముందు సన్నద్ధత కోసం ఇండియా -ఎ జట్టు తరపున ఆడాలని కోహ్లీ నిర్ణయించుకోవడాన్ని భారత ఏ క్రికెట్ జట్టు కోచ్‌గా ఉన్న ద్రావిడ్ ప్రశంసించాడు. అది గొప్ప నిర్ణయం. అద్భుతమైన నిర్ణయమన్నాడు. 
 
కోహ్లీ నిర్ణయంపై ద్రావిడ్ స్పందిస్తూ మూడు వారాల కిందట కోహ్లీ నాతో మాట్లాడాడు. ఆసీస్-ఎ జట్టుతో సిరీస్ సందర్భంగా కనీసం ఒక మ్యాచ్ లోనైనా ఆడే చాన్స్ ఇవ్వాలని కోరాడు. శ్రీలంక టూర్ కోసం తనను తాను సిద్ధం చేసుకోవాలన్న తపన అతడిలో కనిపిస్తోంది. ఆట పట్ల అతడి అనురక్తికి ఇది నిదర్శనం.
 
మరింత మ్యాచ్ ప్రాక్టీసు ఉంటే లంకతో సిరీస్‌లో రాణించగలనన్న ఉద్దేశంతోనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు అని కితాబిచ్చారు. కోహ్లీని ఆకట్టుకునేందుకు యువ ఆటగాళ్లకు ఇదో చక్కని అవకాశమని భావిస్తున్నా. కోహ్లీ ముందే తమ ప్రతిభను చాటుకునే మెరుగైన అవకాశం వారి ముందు నిలిచింది అని ద్రావిడ్ అభిప్రాయపడ్డారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments