Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ, రవిశాస్త్రిల వల్లే ఇషాంత్ శర్మకు ఈ పరిస్థితి: కోచ్ ఫైర్

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (13:39 IST)
శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ... లంకేయులకు చుక్కలు చూపించాడు. మొత్తం 13 వికెట్లు పడగొట్టిన ఇషాంత్ శర్మ చివరి టెస్టులో మాత్రం 8 వికెట్లు పడగొట్టి సిరీస్‌ను గెలుచుకోవడంపై కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో, తనను తాను నిలువరించుకోలేక, శ్రీలంక ఆటగాళ్లతో వాదనకు దిగి ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, టీమ్ డైరక్టర్ రవిశాస్త్రిలపై ఇషాంత్ శర్మ చిన్ననాటి కోచ్ శ్రావణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వీరిద్దరి వల్లే ఇషాంత్ భావోద్రేకాలను నియంత్రించుకోవడంలో విఫలమయ్యాడని మండిపడ్డారు. స్లెడ్జింగ్ గురించి వీరిద్దరూ చెబుతుండటం వల్లే ఇషాంత్ కంట్రోల్ కోల్పోయాడని, చివరకు ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడన్నారు. 
 
ముఖ్యంగా కెప్టెన్, డైరెక్టర్ లాంటి వారు అగ్రెషన్ గురించి చెబుతున్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోరాదని కోచ్ హితవు పలికారు. ఇంత జరిగిన తర్వాత కోహ్లీ, రవిశాస్త్రి బాగానే ఉన్నారని... నిషేధం ఎదుర్కొంటున్నది ఇషాంత్ శర్మ మాత్రమే అని అన్నారు. ఇలాంటి ఘటనల ద్వారా ఇషాంత్ శర్మకు గుణపాఠం వస్తుందని, పరిపక్వత కూడా లభిస్తుందని.. ఇలాంటి పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో బాగా అర్థమవుతుందని చెప్పారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments