Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించాలి : వసీం జాఫర్

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (17:22 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్ జట్టులోని లుకలుకలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. 
 
దీనిపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2023 వరల్డ్‌కప్ ఆడాలి. అటు ఈ వైఫల్యం వల్ల వన్డే కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగిస్తే బాగుంటుందా.? అనే ప్రశ్నను కూడా అభిమానులను అడిగాడు. ఏది ఏమైనా అతడు చేసిన ప్రశ్నకు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా, ఈ వరల్డ్ కప్‌లో భారత ప్రదర్శన అద్భుతంగా సాగింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ చేతిలో 18 రన్స్ తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ ఓటమితో టీమ్‌పై సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఒకవైపు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీని రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఫ్యాన్స్ అభ్యర్థిస్తుంటే.. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
 
కాగా, ఈ టోర్నీలో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. లీగ్ మ్యాచ్‌లలో ఏకంగా ఐదు సెంచరీలు, ఒక అర్థ సెంచరీతో మొత్తం 648 పరుగులు చేశాడు. కానీ న్యూజిలాండ్‌తో సెమీస్ పోరులో మాత్రం అతడు ఒక్క పరుగుకే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అటు ఈ ఓటమి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ప్రభావం చూపడమే కాదు.. కోచ్ రవిశాస్త్రీ, కోహ్లీ మధ్య సఖ్యతలేమిని కూడా ఎత్తి చూపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

Jagan Birthday: జగన్‌కు నాగబాబు, చంద్రబాబుల పుట్టినరోజు శుభాకాంక్షలు

Revanth Reddy: సినిమా వాళ్లకు రేవంతన్న వార్నింగ్.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలుండవు..

Revanth Reddy:Allu Arjun కాళ్ళు పోయాయా, చేతులు పోయాయా... ఓదార్పు ఎందుకు? (video)

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments