Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశాంత్‌కు తప్పని కష్టాలు: హైకోర్టులో సవాల్ చేసిన ఢిల్లీ పోలీసులు

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (12:55 IST)
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు మళ్లీ చిక్కులు తప్పేలా లేవు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుల్లో చిక్కుకుపోయిన శ్రీశాంత్ కష్టాలను కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్‌ను క్రీడాభిమానులను నివ్వెరపరిచారు. దీనిపై తొలుత విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ కోర్టు ముగ్గురు క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటించింది.
 
అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ పోలీసులు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ  పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరోమారు పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది.

అంతేకాక ఈ దఫా మరింత కీలక సమాచారాన్ని పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పించేందుకు ఢిల్లీ పోలీసులు సమాయత్తమవుతున్నారు. దీంతో హైకోర్టు విచారణలో శ్రీశాంత్ సహా ముగ్గురు క్రికెటర్లపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments