Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2024 Auction: ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు మరో జార్ఖండ్ డైనమైట్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తోపు

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (19:17 IST)
Kumar Kushagra
దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో జార్ఖండ్ వికెట్ కీపర్, బ్యాటర్ కుమార్ కుశాగ్రా జాక్‌పాట్ కొట్టాడు. వేలంలో రూ.20 లక్షల కనిష్ట ధరతో అడుగుపెట్టిన కుశాగ్ర.. అనూహ్యంగా రూ. 7.2 కోట్లు ధర పలకడం గమనార్హం. దేశవాళీ క్రికెట్‌లోనూ పెద్దగా వినిపించని కుశాగ్రా పేరు వేలంతో బాగా వినబడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లెజెండరీ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు కుశాగ్రా కోసం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ పోటీపడటం గమనార్హం. 
 
ఇంతకీ కుశాగ్రుడు ఎవరు...?
జార్ఖండ్ డైనమైట్.. భారత క్రికెట్ జట్టుకు రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన మహేంద్ర సింగ్ ధోనీ స్వస్థలమైన కుశాగ్రా రాష్ట్రమైన జార్ఖండ్‌కు చెందినవాడు. అతను రాష్ట్రంలోని బొకారో నివాసి. అతను అక్టోబర్ 23, 2004న జన్మించాడు. ధోనీని మెచ్చుకునే కుసాగ్రా అతనిలాగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. ఈ 19 ఏళ్ల కుర్రాడు రెండేళ్ల క్రితం దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
 
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తోపు రికార్డు..
2021లో లిస్ట్ ఎ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కుశాగ్రా 2022లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన కుశాగ్రా 39.45 సగటుతో 868 పరుగులు చేశాడు. గతేడాది రంజీ సీజన్‌లో భాగంగా నాగాలాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 269 బంతుల్లో 266 పరుగులు చేశాడు. ఇందులో 37 బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 
 
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2022-23 విజయ్ హజారే ట్రోఫీ అలాగే దేవదార్ ట్రోఫీ. అతను విజయ్ హజారే ట్రోఫీలో 275 పరుగులు, దేవదార్ ట్రోఫీలో 227 పరుగులు చేశాడు. యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ 2020లో అండర్-19 ప్రపంచకప్ జట్టులో సభ్యుడు కావడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

తర్వాతి కథనం
Show comments