Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటవరణ పరీక్షణలో బీసీసీఐ - ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు

Webdunia
బుధవారం, 31 మే 2023 (16:52 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ఇందుకోసం ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌లో ఒక్కో డాట్​ బాల్​కు 500 చెట్లు నాటుతామని ప్రకటించింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌తో ఐపీఎల్-16 సీజన్‌ ముగిసింది. మరి ప్లేఆఫ్స్​లో ఎన్ని డాట్​ బాల్స్​ నమోదయ్యాయి?, ఎన్ని మొక్కలను నాటబోతున్నారో తెలుసుకుందాం. 
 
చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్-1లో 84 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయి. ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు కలిపి 96 డాట్ బాల్స్‌ వేశారు. గుజరాత్, ముంబై మధ్య జరిగిన క్వాలిఫయర్-2లో 67 డాట్ బాల్స్‌ వేయగా..  చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 45 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయి. 
 
ఈ లెక్కన ప్లేఆఫ్స్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో మొత్తం 292 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయన్నమాట. అంటే 292×500 లెక్కన  బీసీసీఐ మొత్తం 1,46,000 మొక్కలు నాటనుంది. ఈ డాట్‌ బాల్స్‌లో సింహభాగం ఆకాశ్‌ మధ్వాల్, మహ్మద్‌ షమి, రషీద్‌ఖాన్‌, మతీశా పతిరనలదే కావడం గమనార్హం. 
 
భారత క్రికెట్ బోర్డు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. భవిష్యత్తులోనూ ఇలానే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖరి బంతికి విజయం సాధించి ఐదో టైటిల్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments