Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ టోర్నీపై కరోనా వైరస్ ఎఫెక్టు... జరిగేనా... వాయిదాపడేనా?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (15:25 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29వ తేదీన ఆరంభంకావాల్సివుంది. అయితే దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి అనేక రాష్ట్రాలకు విస్తరిస్తుండటంతో ఈ నెలాఖరు నాటికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్ సజావుగా ఆరంభమవుతుందా అన్నది మిలియన్ డాలర్ల సందేహంగా నిలిచింది. 
 
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా పోటీలు కరోనా భయంతో వాయిదాపడ్డాయి. మలేసియా వేదికగా ప్రతి ఏడాది జరిగే అజ్లాన్ షా హాకీ టోర్నీ వాయిదాపడింది. నేపాల్‌లో జరగాల్సిన ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు సైతం కరోనా తాకిడి తప్పలేదు. 
 
ఈ టోర్నీ రీషెడ్యూల్ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మరికొన్ని వారాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైనే ఐపీఎల్ తాజా సీజన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 
 
ఎందుకంటే, ఐపీఎల్ మ్యాచంటే వేలల్లో అభిమానులు స్టేడియాలకు వస్తుంటారు. గ్యాలరీల్లో క్రిక్కిరిసిన జనసందోహాల నడుమ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం దుస్సాధ్యమనే చెప్పాలి. ఓవైపు ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లతో సన్నాహాలు షురూ చేశాయి కానీ, లోలోపల భయం పీడిస్తూనే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూకే పర్యటన కోసం పర్మిషన్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

తర్వాతి కథనం
Show comments