Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో రికార్డుల పంట పండిస్తున్న చెన్నై కింగ్స్ కెప్టెన్ ధోనీ

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (10:45 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుల పంట పండిస్తున్నాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై చివరి వరకు పోరాడింది. అయితే కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 
 
ఈ మ్యాచ్‌లో ధోనీ 48 బంతుల్లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 84 పరుగులు సాధించాడు. టీ-20 ఫార్మెట్‌లో ధోనీకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఏడు సిక్సర్లు బాదాడు. ధోనీ ఐపీఎల్‌లో మొత్తం 203 సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ (203 సిక్సర్లు) మూడో స్థానంలో నిలిచాడు. 
 
ధోనీ కంటే ముందు క్రిస్ గేల్(323 సిక్సర్లు), ఏబీ డీ విల్లియర్స్(204) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేల పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గానూ ధోనీ రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments