Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-11: హమ్మయ్య.. కోహ్లీసేన ఢిల్లీపై గెలిచింది.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌న

Webdunia
ఆదివారం, 13 మే 2018 (11:25 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌ను రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి.. ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌ చెలరేగడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే రాయల్ ఛాలెంజర్స్ లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఓటమితో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్లే ఆఫ్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ ఆటగాళ్లలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 40 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేయగా.. ఏబీ డివిలియర్స్‌ 37 బంతుల్లో 4  ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. 
 
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆటగాళ్లలో ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీషా, జాసన్‌ రాయ్‌లను వెంటవెంటనే చాహల్‌ వెనక్కి పంపాడు. అయినప్పటికీ ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ చెలరేగడంతో స్కోరువేగం పెరిగింది. 
 
శ్రేయర్‌ అయ్యర్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్‌‌మెన్‌ అభిషేక్‌ శర్మ తన మొదటి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. 19 బంతుల్లోనే 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 21 పరుగులు చేసిన విజయ్‌శంకర్‌తో కలిసి.. ఢిల్లీకి భారీస్కోరును అందించాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలలో 181 పరుగులు సాధించింది. అయితే ఢిల్లీ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి డూ ఆర్‌ డై స్థితిలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్‌ అవకాశాలను నిలుపుకుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments