ఐపీఎల్ 2018 : జడేజా స్పిన్‌ మేజిక్‌.. బెంగళూరు చిత్తు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు చేతిలో బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడింది. బౌలర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై.. సీనియర్‌ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3

Webdunia
ఆదివారం, 6 మే 2018 (09:52 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు చేతిలో బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడింది. బౌలర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై.. సీనియర్‌ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/18), హర్భజన్‌ సింగ్‌ (2/22) బెంగళూరు పతనాన్ని శాసించారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల తేడాతో బెంగుళూరు జట్టుపై నెగ్గింది. ఈ ఓటమితో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ రేసులో ఉండాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లను నెగ్గాల్సిందే.
 
కాగా, శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. పార్థివ్‌ పటేల్‌ 41 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగులు, సౌథి 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో సాయంతో 36 (నాటౌట్‌) మాత్రమే రాణించారు. 
 
అనంతరం బరిలోకి దిగిన చెన్నై 18 ఓవర్ల లో 4 వికెట్లకు 128 పరుగులు చేసి నెగ్గింది. మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడు 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేయగా, కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ 23 బంతుల్లో ఒక్క ఫోర్‌, 3 సిక్సర్లతో 31 (నాటౌట్‌), సురేష్ రైనా 25 పరుగులతో రాణించారు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చిన సీఎస్కే బౌలర్ రవీంద్ర జడేజాకు "మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" అవార్డు దక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments