Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్10 : ప్లే ఆఫ్ రేస్ నుంచి మూడు జట్లు ఇంటికి...

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్ టోర్నీలో భాగంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి మూడు జట్లు నిష్క్రమించాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాల తర్వాత ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్లుగా రాయల్ ఛాలెంజర్స్ బె

Webdunia
మంగళవారం, 9 మే 2017 (15:54 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్ టోర్నీలో భాగంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి మూడు జట్లు నిష్క్రమించాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాల తర్వాత ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు మొదటి వరుసలో ఉన్నాయి. 
 
సోమవారం రాత్రి ఉప్పల్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించి.. ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబైపై సన్‌రైజర్స్ విజయం సాధించడంతో ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ నుంచి మరో జట్టు తప్పుకుంది.
 
లీగ్ స్టేజీలో బెంగళూరు (5 పాయింట్లు) ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉండగా, గుజరాత్ (8 పాయింట్లు) రెండు మ్యాచ్‌లు, ఢిల్లీ డేర్ డెవిల్స్ (8 పాయింట్లు) మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు జట్లు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6, 7, 8 స్ధానాల్లో ఉన్నాయి.
 
12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. కోల్‌కతా రెండో స్థానంలో ఉండగా, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ మూడో స్థానంలో కొనసాగుతోంది. రెండు జట్లు కూడా 16 పాయింట్లను కలిగి ఉన్నాయి.
 
15 పాయింట్లతో సన్ రైజర్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ టాప్ 4 స్థానంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే పంజాబ్ తొలి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
 
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన పంజాబ్ 10 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో మూడు ప్లే ఆఫ్ బెర్తుల కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

తర్వాతి కథనం
Show comments