Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సూపర్ కింగ్స్‌తో ఐపీఎల్ మ్యాచ్: కోహ్లీ సేనకు కష్టాలు!

Webdunia
సోమవారం, 4 మే 2015 (19:35 IST)
ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పది పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఐపిఎల్‌లో ఆరంగేట్రం చేసిన మాడిసన్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఈశ్వర్ పాండే బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత రెండో వికెట్‌హా డీ విల్లీర్స్ అవుటయ్యాడు. ఆ వెంటనే 48 పరుగుల స్కోరు వద్ద మన్‌దీప్ సింగ్ పరుగులేమీ చేయకుండా మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 97 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కష్టాల్లో పడింది.
 
దినేష్ కార్తిక్ 97 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా నెహ్రూ బౌలింగులో వెనుదిరిగాడు. అంతకు ముందు విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 48 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. ఎంతో నమ్మకం పెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 111 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 112 పరుగుల వద్ద బెంగళూర్ ఏడో వికెట్ కోల్పోయింది. 
 
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో జరిగే ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అంతకుముందు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments