Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్, లారా, పాంటింగ్‌ ముగ్గురూ వేస్ట్.. ఇంజమామే బెస్ట్: షోయబ్ అక్తర్

భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌లపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో రికా

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (17:33 IST)
భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌లపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఎన్నో రికార్డులతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కలిగిన ఈ ముగ్గురు అంత గొప్ప ఆటగాళ్లు కారని అక్తర్ పేర్కొన్నాడు. క్రికెటర్లలో గ్రేట్ బ్యాట్స్‌మెన్ల వికెట్లు పడగొట్టడం కష్టమైనప్పటికీ తాను మెరుగైన బౌలింగ్‌తో ఔట్ చేయగలిగానని అక్తర్ తెలిపాడు. 
 
కానీ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ను ఔట్ చేయడం ఎంతో క‌ష్ట‌ంతో కూడుకున్నపని అని తెలిపాడు. తాను ఇంజ‌మాన్‌ని నెట్స్‌లో ఒక్కసారి కూడా ఔట్ చెయ్య‌లేద‌ని అక్తర్ గొప్పలు చెప్పుకున్నాడు.

తన బౌలింగ్‌ను ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్‌ల‌లో ఆయ‌నే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని షోయబ్ కొనియాడాడు. అంతేగాకుండా ప్రపంచ క్రికెటర్లలో ఇంజ‌మామ్‌తో సరితూగే బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ లేర‌ని అన్నాడు. ఇంజ‌మామ్‌తో ఏ బ్యాట్స్‌మెన్‌నీ పోల్చడం కుదరదని అక్తర్ వ్యాఖ్యానించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

తర్వాతి కథనం
Show comments