Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టెస్టు : వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ సేన విజయం

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సత్తా చాటింది. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. అంటిగ్వా వేదికగా జరిగిన జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌‌లో 92 పరుగుల తేడాతో గెలుపొందింది.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (09:23 IST)
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సత్తా చాటింది. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. అంటిగ్వా వేదికగా జరిగిన జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌‌లో 92 పరుగుల తేడాతో గెలుపొందింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న భారత క్రికెట్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లోనే 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ భారీ ఇన్నింగ్స్‌లో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా సెంచరీతో రాణించాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండిస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మరింత పేలవంగా ఆడి 231 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయకేతనం ఎగురవేసింది. 
 
ఇక విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను అశ్విన్ కుప్పకూల్చాడు. మొత్తం 25 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన అశ్విన్... ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వెరసి టీమిండియా ఘన విజయానికి బాటలు పరిచాడు. ఫలితంగా అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments