Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ప్రపంచ కప్ : అదరగొట్టిన టాపార్డర్ బ్యాటర్లు .. శ్రీలంక ముందు భారీ టార్గెట్

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (18:25 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్ తన ప్రత్యర్థి శ్రీలంక జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో శ్రీలంక ముగింట 359 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా, మిగిలిన టాపార్డర్ బ్యాట్‌తో వీరవిహారం చేశారు. 
 
రోహిత్ శర్మ నాలుగు పరుగులకే ఔటైనప్పటికీ మరో ఓపెనర్ శుభమన్ గిల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 92, విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో దిల్షాన్ మధుశంక వీరి జోడీని విడిదీశాడు. దీంతో కోహ్లీ మరోమారు సెంచరీ చేజార్చుకున్నాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 56 బంతుల్లో ఆరు సిక్స్‌లు, మూడు ఫోర్ల సాయంతో 82 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 19 బంతుల్లో రెండు ఫోర్లతో 21 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు, రవీంద్ర జడేజా 34 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 5, దుష్మంత చమీర ఒక వికెట్ చొప్పున తీశాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు గెలుపొందాలంటే 50 ఓవర్లలో 359 పరుగులు చేయాల్సివుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

తర్వాతి కథనం
Show comments