Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పరుగుల యంత్రం' కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. ఏంటది?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. వాస్తవానికి ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఖాతాలో ఉండేది. దాన్ని విరాట్ కోహ్లీ సమం చేశాడు.

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (09:08 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. వాస్తవానికి ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఖాతాలో ఉండేది. దాన్ని విరాట్ కోహ్లీ సమం చేశాడు. 
 
శ్రీలంకతో కోల్‌కతాలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డకౌట్ అయిన కోహ్లీ ఒక యేడాదిలో అత్యధిక డకౌట్లు అయిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ యేడాది ఇలా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం ఇది ఐదోసారి. ఈ వికెట్‌ను శ్రీలంక బౌలర్ లక్మల్‌కు సమర్పించుకున్నాడు. 1983లో కపిల్ దేవ్ కూడా ఇలాగే ఏడాదిలో ఐదుసార్లు డకౌట్ అయ్యాడు. ఇప్పుడీ రికార్డును కోహ్లీ సమం చేశాడు.
 
కాగా, గత ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో పుణెలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ తొలిసారి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి, సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన వన్డేలో మూడోసారి, గౌహతిలో జరిగిన టీ20లో నాలుగోసారి కోహ్లీ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. తాజాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో లక్మల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments